కాంగ్రెస్ కోతులకి పెట్టాలె వాతలు!!!


By deshetti - Posted on 15 February 2010

మా ఒట్లతోని గద్దెనెక్కి

కోట్లు, కోట్లు తెగ మెక్కి

మా గోసలు అప్పుడె మరచినారా

సిగ్గులేని కాంగ్రెస్ నాయకులారా

 

చీమ మెదడు కూడా చిన్నబోయే తెలివి

జాన రెడ్డికి మాత్రమె సొంతమట సి.ఎం పదవి

కెకె, విహెచ్, డిఎస్ డూడూ బసవన్నల తీరు

హైకమాండె వేదమట, ప్రజల తీర్పు బేఖాతరు

 

కృష్ణ కమిటి ముష్టి నియమాలు

కనిపిస్తలేవ మీ కళ్లకి కపట వేషాలు ?

కోసిన కాడికి సాలిగ తీస్మార్ఖాన్ కోతలు

పదవులకి వెంటనె చెయ్యాలె రాజీనామాలు 


ప్రాంతం వాడె మమ్ముల మోసం చేస్తె

ఒట్లడుక్కొని నోట్ల మట్టి  కొడ్తె

గుండ్లు గీయించి ఊరంత ఊరేగిస్తం 

ప్రాణాలతోనె మిమ్ముల పాతర వేస్తం

                                 -శశికిరణ్ దేశెట్టి

 

 

ఇదే ముచ్చట చెప్పుకుంట ఒకప్పుడు కాళోజీ రాసిన కవిత. ఇన్నేళ్ళయిన ఈ కవితలు ఇప్పటికి వాడాల్సిన అవసరం ఒచ్చుడు మన రాజకీయ దుస్థితికి అద్దం పడ్తుంది.  

 

ఢిల్లీ దర్బారీలకు 

పల్లీయుల అలజడంత 

ముఠా రాజకీయాల 

శఠమని తోచుట సహజము

 

పార్టే దేశము అనుకొను

పాటిది వారి నిజాయితి

ముఠాదే రాజ్యమ్మను

శఠము బూనినోరువారు.

పార్టీప్రత్యమువారిది

పాపము దాచెడి నడవడి

ప్రజాస్వామ్య రాజ్యాంగం

ఫక్తు నినాదము వారిది.

http://yuvatelangana.com/node/179


 

 

Jana Reddy is dreaming of becoming CM of Telangana. Then, let him take the lead and convince all his MLA's to resign to put pressure on their high command.   

Manchiga raasinav shashi ,, vatti vathalaku,, vallu em vangutharu,, Kaallu chethulu iragottale,,thokalu kaalabettale,,,