
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ SIR కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి గారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉన్న 11 బూతులలో ఉన్న ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అర్హులైన యువతీ యువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, అలాగే ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడం, చిరునామా మార్పులు, పేర్ల మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బూత్ లెవల్ అసిస్టెంట్లకు సూచించారు.
ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నేతావత్ రాజేందర్,తిరుపెల్లి కుమారస్వామీ, బూత్ లెవల్ అసిస్టెంట్లు పాలకుర్తి శ్రీకాంత్, బక్కతట్ల రాజ్ కుమార్, పూజారి శ్రీను, లింగాల రజిత రెడ్డి,కుక్కల రాకేష్, Md. షేభిర్, శ్రీకాంత్, నోముల గౌరవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు…
