
పాలకుర్తి నియోజకవర్గం తేదీ: 24-08-2026..
† బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ..
పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి రాయపర్తి మండలంలోని పలువురు బాధితులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా రాయపర్తి టౌన్ మండల యువజన నాయకుడు చెగొండ సాయి ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా శివరాంపురం గ్రామ ఉప సర్పంచ్ భూక్యా లచ్చు గారి తండ్రి భూక్యా వస్రం ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే కాట్రపల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు రాపాక సోమయ్య మరణించడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు.

