
రాయపర్తి మండల సర్పంచులు, పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమైన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు..
రాయపర్తి మండల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు..
ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు మరియు పార్టీ శ్రేణులందరూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు..
బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, పార్టీ శ్రేణులు సంబంధిత BLOలతో సమన్వయం చేసుకుంటూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల సవరణ, ధృవీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు..
ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని పేర్కొంటూ, ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు..

