
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు:
పాలకుర్తి,దేవరుప్పుల మండలాల్లో జరిగిన చేనేత సంఘాల ఎన్నికల్లో గెలిచిన వారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ప్రతిపక్షంలో ఉన్న కూడా మనం ఈ ఎన్నికల్లో గెలిచాం అంటే మన పట్ల మన పార్టీ పట్ల ఉన్న నమ్మకం కనిపిస్తుంది.
9 మందికి 9 మంది గెలిచారు అంటే మనం మన పార్టీ ఎంత గొప్పగా పని చేసిందో తెలుస్తుంది.
మన దయన్న కూడా మన వారు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే ఎర్రబెల్లి ఛారిటీ ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మన ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు అని దయన్న కొడకండ్ల కి టెక్స్ టైల్స్ పార్క్ తెస్తే కనీసం అది కూడా పూర్తి చేయలేని దుస్థితి ఈ ప్రభుత్వం ఉంది.
చేనేత రంగాన్ని, నేతన్నలను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది
ఈ ప్రభుత్వం చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలి
నేతన్నలకు పొదుపు, బీమా పథకాల ప్రయోజనాలు అందించాలి
ముడిసరుకు ధరలను తగ్గించి సబ్సిడీ పెంచాలి
చేనేత ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి
చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలి
నాడు నేతన్నలకు రుణమాఫీ చేసి, వడ్డీ లేని రుణాలు అందిస్తే ఈ ప్రభుత్వం కనీసం కరెంటు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది.
నాడు మన ప్రభుత్వం లో చేనేత కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాము నేడు అది కూడా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయింది.
ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ శాఖల అవసరాల్లో చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
నేతన్న బతికితేనే చేనేత బతుకుతుంది అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో లో నూతనంగా ఎన్నికైన పాలక వర్గం, జిల్లా, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.


