
సూర్యాపేట జిల్లా కోదాడలో తమ సమీప బంధువు శ్రీ గోపి గారి తల్లి దశదిన కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దివంగతురాలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం గోపి గారు మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
