
రాయపర్తి ఆగస్టు 6 ( యువ తెలంగాణ ) : తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గట్టికల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారంఘనంగా నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ చెవ్వు హేమలత కాశీనాథం జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చెవు హేమలత కాశినాదం మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ సార్ తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని పేర్కొన్నారు.తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను లోతుగా అధ్యయనం చేసి, ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని శాస్త్రీయంగా ప్రపంచానికి వివరించిన గొప్ప మేధావి జయశంకర్ అని అన్నారు.ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, తెలంగాణ సమాజం పట్ల చూపిన అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేయడమే జయశంకర్ సార్కు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిర్ర నాగరాజు వార్డు మెంబర్స్ ,చిన్నాల రఘు, శ్రీనివాస్, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

