
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారికి జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి లకావత్ ధనవంతి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయడం తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించి చర్చించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథలయా చైర్మన్ రాంబాబు గారు, కాంగ్రెస్ నాయకులు, మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

