
పాలకుర్తి నియోజకవర్గం తేదీ: 24-08-2026..
రాయపర్తి మండలంలో ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ..
రాయపర్తి మండలంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డులను పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తోందని తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు పారదర్శకంగా నిత్యావసర సరుకులు అందడంతో పాటు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.


