
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పర్వతగిరి , ఆగష్టు 1 ( )
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ పట్నం నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల తల్లి రుక్కమ్మ ఇటీవల మరణించగా, శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారి నివాసానికి చేరుకుని, రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు,అనంతరం నరేందర్ రెడ్డి , మహేందర్ రెడ్డి గారితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

