
గీత కార్మికుడిని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్
వర్దన్నపేట నియోజకవర్గం లోని రాయపర్తి మండలం గట్టికళ్ళు గ్రామానికి చెందిన చిర్ర యాక సాయిలు గౌడ్ ప్రమాదవషాత్తు తాటి చెట్టు పై నుండి కింద పడటం జరిగింది. ఇది గమనించిన తోటి గీత కార్మికులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హన్మకొండ కు ఓ ప్రవేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో యాక సాయిలు గౌడ్ కు ఛాతి తో పాటు కుడి ప్రక్క ఎముకలు విరిగినట్లు హాస్పిటల్ వైద్యులు తెలిపారు. హాస్పిటల్ చికిత్స పొందుతున్న యాక సాయిలు గౌడ్ ను గురువారం గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు
దెబ్బ స్టేట్ వొర్కింగ్ ప్రెసిడెంట్
ఆనంతుల రమేష్ గౌడ్, నాయకు
లు ముంజాల రమేష్ గౌడ్, బూడిద శ్రీనివాస్ గౌడ్ లు పరామర్శించడం జరిగింది. నిరుపేద గీత కార్మికుడైన యక సాయిలు గౌడ్ కు ప్రభుత్వం హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని రమేష్ గౌడ్
డిమాండ్ చేశారు.
