
రాయపర్తి జూలై 15 : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీ శుక్రవారం హైదరాబాద్లోని నూతన తెలంగాణ సచివాలయం ఎదుట అమర జ్యోతి ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల భారీ సమావేశం నిర్వహించనున్నట్లు రాయపర్తి మండల ఉద్యమకారుల మండల అధ్యక్షులు ఎనగందుల శ్యాంసుందర్ తెలిపారు.ఈ సమావేశానికి రాయపర్తి మండలం నుంచి అత్యధిక సంఖ్యలో ఉద్యమకారులు హాజరై తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని, ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి గుర్తింపు కార్డు, 250 చదరపు గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల జీవన భద్రత కోసం రూ.10 వేల కోట్ల ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాలు, విద్య, వైద్యం తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.
