
చర్లపాలెం: గ్రామం ధర్మారపు మహేందర్ (హమిక్) గారి తండ్రి మరియు తల్లి అయినా ఒకే కుటుంబానికి చెందిన ధర్మారపు లాలయ్య మరియు ధర్మారపు ఎల్లమ్మ గార్లు మూడు రోజుల వ్యవధిలోనే అనారోగ్య సమస్యలతో మృతి చందగా విషయం తెలుసుకున్న తొర్రుర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి గ్రామ మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి మరియు జక్కా ఇంద్రసేన రెడ్డి గార్లు లాలయ్య మరియు ఎల్లమ్మల చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. గత రెండు సంవత్సరాల క్రితం మహేందర్ గారి ఇద్దరు అన్నలు మరియు వదిన గార్లు మృతి చెందారు ఇప్పుడు మూడు రోజుల వ్యవధిలోనే తల్లి మరియు తండ్రిని కోల్పోవడం దురదృష్టకరమని ఇలాంటి హృదయ విధారక సంఘటన చూసి మనసు కలచి వేసిందని అన్నారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి బాధితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 5000 వేలు మరియు 25 కేజీల బియ్యాన్ని అందించారు..
అనంతరంపాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గార్ల సహకారంతో అన్ని విధాలుగా ఆధుకుంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు చర్లపాలెం మాజీ ఎంపీటీసీ ధర్మారపూ కిరణ్, ఫతేపురం గ్రామ సర్పంచ్ ఇట్టే మాధవరెడ్డి,కిష్టాపురం గ్రామ సర్పంచ్ నకిరేకంటి మాధవి సంపత్, బీరెల్లి మహబూబ్ రెడ్డి, ఎద్దు ఐలయ్య, సముద్రాల చెన్నమలు, సింగారపు సతీష్, ధర్మారపు రామళ్ళు, ధర్మారం వెంకన్న, ధర్మారపు ప్రశాంత్, కుర్ర సుధాకర్, దర్శనాల మహేందర్, బచ్చలి చంద్రయ్య,వెన్నం సోమిరెడ్డి, గూడెల్లి రామచంద్రయ,మహంకాళి సంపత్,యర్రం రాజు యాదవ్, అబ్బనపురి వెంకటాచారి, వేల్పుల వెంకన్న, నడిగడ్డ మధు, మహంకాళి మోహన్ రావు,గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
