
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మరియు ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన డాక్టర్ విశారదన్ మహారాజు గారి అక్రమ అరెస్టును ఖండించాలి హనుమకొండలోని హంటర్ రోడ్డు నందుగల నంది హిల్స్ లోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల మీటింగ్లో ఈనెల 29వ తారీఖున జగిత్యాల జిల్లాలో జరుగుచున్న లక్ష కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా నూకల పెళ్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్లలో నివాసముంటున్న ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తు మహా ధర్నా చేపట్టి అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించుటలో భాగంగా మహా ధర్నాలో నిరసన తెలుపుతున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అక్రమంగా పోలీసులు నిర్బంధించి అరెస్టు చేసినందుకు తీవ్రంగా వరంగల్ ఉమ్మడి జిల్లాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలన్నీ తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఇకనైనా ప్రభుత్వం ప్రశ్నిస్తున్న గొంతులను ధర్నాలు చేస్తున్న అభాగ్యులను శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలుపుతున్న న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఏ ఉద్యమ కారులనైన అరెస్టు చేయకుండా వారిపై కేసులు పెట్టకుండా వారి సమస్యలను సానుకూల దృక్పథంతో అధికారులు గానీ పోలీసులు గాని స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ శ్రద్ధగా విని సమస్యలను పరిష్కరించే మార్గంలో ఆలోచించాలి గానీ లాటి చార్జి చేయడం అమానుషంగా అరెస్టులు చేయడం వారి నిరసనలను భగ్నం చేయడం భవిష్యత్తులో చేయకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు పోలీసులకు తగు సూచనలు చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ చైర్మన్ డాక్టర్ చంద మల్లయ్య గారు రాష్ట్ర కార్యదర్శి పొదిల సాయిబాబా గారు కోఆర్డినేటర్ మేకల సుమన్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మైదం రవి, కొట్టే యేసబు, బోయిన సదానందం, రొడ్డ మురళీకృష్ణ, గుల్లపల్లి సురేష్ గౌడ్, ప్రకాష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

