
బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం గ్రామంలో ముత్యాలమ్మ బోనం ఎత్తిన ఎర్రబెల్లి దయాకర్ రావు , చౌడూరు గ్రామంలో పోచమ్మ బోనాల పండుగలో పాల్గొని ముత్యాలమ్మ తల్లిని, పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రితో పాటు మండల నాయకులు,ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు


