
రాయపర్తి ఆగస్టు 11( యువ తెలంగాణ ): మండలం మైలారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉళ్లేంగుల నర్సయ్య ని పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు.ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని మైలారం గ్రామంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న నర్సయ్య ని ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, జరుగుతున్న చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.పార్టీ కోసం నిత్యం కష్టపడే కార్యకర్త, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న నర్సయ్య త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని, తిరిగి ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకాంక్షించారు. అవసరమైన అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షులు జాటోత్ హామ్య నాయక్ , మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బీరం వెంకట్ రెడ్డి, చెవ్వు కాసినారం, రెంటాల గోవర్ధన్ రెడ్డి, మండల నాయకులు, మైలారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

