
ఉమ్మడి వరంగల్ జిల్లా సగర (ఉప్పర) సంక్షేమ సంఘ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా నన్ను ఘనంగా సన్మానించి హృదయపూర్వకంగా అభినందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉప్పరి శేఖర్ సగర గారు, సగర సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ సీత కమలాకర్ గారు, సగర సంఘం పెద్దలు, మాజీ కార్పొరేటర్లు, ధర్మకర్తల మండలి సభ్యులు, సంఘ నాయకులు పాల్గొని తమ ఆశీస్సులు, అభినందనలు అందించారు.
ఈ సందర్భంగా నాపై చూపించిన ప్రేమాభిమానాలకు, ఆత్మీయ సన్మానానికి సగర సంఘం పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సగర సమాజం అభివృద్ధి, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సమాజ శ్రేయస్సు కోసం నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.
మీ ప్రేమ, ఆదరణ, ఆశీస్సులే మరింత బాధ్యతతో పనిచేసే శక్తిని ఇస్తాయి.
సోమ రజినీరాజశేఖర్
మున్సిపల్ వైస్ చైర్మన్, తొర్రూరు

