
జనగామలో ఘనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం..
ప్రారంభోత్సవంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు..
జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధనవంతి లక్ష్మీనారాయణ, యాదాద్రి దేవాలయ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణతో కలిసి ప్రారంభం..
జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి లకావత్ ధనవంతి లక్ష్మీనారాయణ గారు, యాదాద్రి దేవాలయ బోర్డు సభ్యులు శ్రీ లక్ష్మీనారాయణ గారితో కలిసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, పేద ప్రజల సంక్షేమానికి అంకితమై ఉన్నాయని తెలిపారు. నూతన జిల్లా కార్యాలయం పార్టీ కార్యకర్తలకు మార్గదర్శక కేంద్రంగా, ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా, పార్టీ కార్యక్రమాల సమన్వయానికి కీలక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు.
జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ నూతన కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.




