
పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ధరావత్ రాజేష్ నాయక్ అధ్యక్షతన నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం
పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారి సూచనల మేరకు అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు దేవరుప్పుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అలువాల కార్తీక్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోనాసి క్రాంతి మండల అధ్యక్షులు దామెర అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న 100 రోజుల కార్యాచరణ పైన చర్చించి, యూత్ కాంగ్రెస్ విత్ iyc అప్ పైన అవగాహన సిబి చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటుందని, కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రకాష్, రాజేష్ యాదవ్, దేవరుప్పుల మండల అధ్యక్షులు వెంకన్న యాదవ్, తొర్రూరు మండల అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్, పెద్దవంగర మండల అధ్యక్షులు హరికృష్ణ గౌడ్, తొర్రూరు టౌన్ అధ్యక్షులు మహేష్ యాదవ్, జిల్లా సోసియా మీడియా కోఆర్డినేటర్ మహేష్, నియోజకవర్గ సోషియల్ మీడియా కోఆర్డినేటర్ అశోక్ యాదవ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యదర్శి రోహిత్, మండల సోషియల్ మీడియా కోఆర్డినేటర్ అఖిల్, యువజన కాంగ్రెస్ కార్యవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

