
పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ శ్రీ పుస్కూరి శ్రీనివాస్ రావు గారి తల్లి ప్రమీల గారు మరణించిన విషయం తెలుసుకుని నేడు వారి నివాసానికి వెళ్లి వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
- ఈ సందర్భంగా ప్రమీలమ్మ గారి పవిత్ర ఆత్మకు భగవంతుడు సద్గతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ శ్రీ పుస్కూరి శ్రీనివాస్ రావు గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రమీలమ్మ గారి భౌతిక దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

