
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎన్. శ్వేతా రెడ్డి, ఐపీఎస్ గారిని ఈరోజు పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్‌కు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు చేపట్టనున్న చర్యలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన శాంతిభద్రతల అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం కొనసాగాలని ఎమ్మెల్యే గారు కోరగా, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేతా రెడ్డి గారు పేర్కొన్నారు.
ఈ మర్యాదపూర్వక సమావేశం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
