
తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి, భూములకు పూర్తి భద్రత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన సమగ్ర భూ రీ-సర్వే కోసం వర్ధన్నపేట మండలంలోని చెన్నారం గ్రామం పైలెట్ గ్రామంగా ఎంపికైంది.అందులో భాగంగానే ఈ రోజు వర్ధన్నపేట మండలం, చెన్నారం గ్రామంలో వరంగల్ ఆర్డీఓ సుమ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల రీ-సర్వే అవగాహన సదస్సు కార్యక్రమానికి వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ లు పాల్గొన్నారు.
