
తొర్రూరు పట్టణ విశ్రాంతి భవనంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన world friendship Day celebration కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ *
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ గారు మాట్లాడుతూ…
స్నేహం అనేది స్వచ్ఛమైన బంధమని, కులమతాలకు అతీతంగా మనుషులను కలిపే శక్తి స్నేహానికి మాత్రమే ఉందని *చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ * పేర్కొన్నారు. కష్టసుఖాల్లో తోడుగా నిలిచే నిజమైన మిత్రులే జీవితానికి అసలైన ఆస్తులని ఆయన అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లూరి నాగేంద్ర చారి, సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఉన్నతాధికారులు, స్నేహితులు ప్రజలు పాల్గొన్నారు…




