
స్వాగతం పలికిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క తన సతీమణితో కలిసి అమెరికా పర్యటనలో భాగంగా సాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులకు ప్రవాస తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారితో కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించి అమెరికా పర్యటన కార్యక్రమాలపై చర్చించారు.
ప్రవాస భారతీయులతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సాంస్కృతిక బంధాల బలోపేతమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అమెరికాలోని పలు నగరాల్లో నిర్వహించనున్న కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొననున్నారు.


