
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడు మృతి
తెలంగాణ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. లక్ష్మణచాంద మండలం నర్సాపూర్‌కి చెందిన నిత్యానందరెడ్డి(26) MS పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కారణంగా గురువారం మరణించాడు.
