
యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ జండా ఆవిష్కరించిన దిలీప్ రాజ్…
యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హన్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరించిన హన్మకొండ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ దిలీప్ రాజ్ *. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు *,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే *నాయిని రాజేందర్ రెడ్డి * ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిలీప్ రాజ్ మాట్లాడుతూ…ఆగస్టు 9 1960 లో ఏర్పడిన యువజన కాంగ్రెస్ ఇందిర గాంధీ ఆదేశాల మేరకు పార్టీ ప్రజలులోకి బూత్ స్థాయిలో తీసుకెళ్లడానికి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎంతో మంది నాయకులను అందించిన ఘనత యూత్ కాంగ్రెస్ ది, ఆదర్శాలను అచంచలమైన దృఢ సంకల్పంతో యూత్ కాంగ్రెస్ ను పటిష్టం చేయడానికి, మరియు రాహుల్ గాంధీ ని పీఎం చేయడానికి అహర్నిశలు యువజన కాంగ్రెస్ నాయకులు కష్టపడాలని అన్నారు.యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా వ్యవస్థపై యువజన కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు



