
కాట్రపల్లిలో 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్ పంపిణీ.. మానవత్వమే మహోన్నత సేవ అని పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి, ఆగస్టు 1: సేవే పరమో ధర్మం అనే లక్ష్యంతో నిరుపేదలు, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న SRR ఫౌండేషన్ మరోసారి తన సేవా కార్యక్రమాన్ని కొనసాగించింది. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీ అబ్బాస్ కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు.ఈ సందర్భంగా SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్ అందజేసి ఆర్థికంగా, మానసికంగా ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ సహాయ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, చిట్యాల వెంకన్న, సంకినేని ఎల్లస్వామి పాల్గొని బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎండీ అన్వార్, మొర్రి రాజేందర్, ముద్రబోయిన శ్రీనివాస్, ఎండీ ఖలీల్, ఎండీ నాసర్, చిడిమిళ్ల అశోక్, బూడిద సోమయ్య, బూడిద శ్రీధర్, బూడిద యాకయ్య, వెలుపుగొండ బిక్షపతి, కందుకూరి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.

