






షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే KR నాగరాజు గారు…
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కొండేటి మధుకర్ మాధవి గార్లు నూతనంగా ఏర్పాటు చేసిన ఓం శ్రీ రాజరాజేశ్వర ఐరన్&సిమెంట్ షాప్ ను గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమానులు ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘన సన్మానం చేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గారు షాపును పరిశీలించి అందుబాటులో ఉన్న సామాగ్రి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే షాప్ యజమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ… వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మెన్ పాలకుర్తి సారంగపాణి,మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ,సొసైటీ చైర్మన్ రాజేష్ ఖన్నా,పట్టణ అధ్యక్షులు మైసా సురేష్,కౌన్సిలర్ పాపారావు,సీనియర్ నాయకులు వెంకన్న,ఈగ దామోదర్,సుధీర్, సాంబయ్య,అన్వర్,శ్రీనివాస్, నియోజకవర్గ,మండల సీనియర్ నాయకులు,కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
