
వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రవాస ప్రముఖులతో కలిసి పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు..

అమెరికాలో నిర్వహించిన టీడీఎఫ్ (TDF) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి విచ్చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు పాల్గొని పలువురు ప్రముఖులను కలుసుకుని ఆప్యాయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలకు టీడీఎఫ్ వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రవాస భారతీయులు తమ మాతృభూమితో అనుబంధాన్ని కొనసాగిస్తూ విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందించడం సంతోషకరమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల సహకారం ఎంతో కీలకమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి వేదికల ద్వారా పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన నాయకులు, ప్రముఖులతో కలిసి జ్ఞాపక చిత్రాలు దిగారు.

