
మెదక్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఫలహారం బండి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
మెదక్: ఈరోజు సాయంత్రం మెదక్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఉత్సవాలలో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
అనంతరం ముదిరాజ్ సంఘం సభ్యులు, టౌన్ నాయకులతో కలిసి పోతరాజుల కోలాహలంలో ఎమ్మెల్యే గారు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు మరియు మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవాలను చూసి ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
జారీ చేసినవారు:
మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్

