
గత 7 సంవత్సరాలుగా తొర్రూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలందించే గౌరవప్రదమైన బాధ్యతను నాకు అప్పగించి, పార్టీ బలోపేతానికి కృషి చేసే అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అలాగే, నాపై పూర్తి విశ్వాసం ఉంచి నిరంతరం ప్రోత్సహిస్తూ, మార్గనిర్దేశనం చేసిన పాలకుర్తి నియోజకవర్గ గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారికి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి, పార్టీ సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా ఆత్మీయ మిత్రులకు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, అలాగే ప్రతి అడుగులోనూ నన్ను ఆదరించి, ఆశీర్వదించి, ప్రోత్సహించిన తొర్రూర్ పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ 7 సంవత్సరాల ప్రయాణంలో మీ అందరి ప్రేమ, ఆప్యాయత, సహకారం, విశ్వాసమే నాకు ఎనలేని బలాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవనే పరమావధిగా భావిస్తూ పనిచేసే అవకాశం దక్కడం నా జీవితంలో ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇదే నిబద్ధతతో, మరింత అంకితభావంతో, మరింత ఉత్సాహంతో సేవలను కొనసాగిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
మీరు చూపించిన ప్రేమ, ఆదరణ, విశ్వాసానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
సదా మీ సేవలో
సోమ రజినీరాజశేఖర్
మున్సిపల్ వైస్ చైర్మన్, తొర్రూర్
