
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రం
09-08-2026
ఘనంగా 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సి రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ యువజన కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఈ సదర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ ఒక నాయకునిగా ఎదగాలంటే తొలి మెట్టు యూత్ కాంగ్రెస్ అని, యూత్ కాంగ్రెస్ నుండి ఎంతో మంది ముఖ్యమత్రులు అయ్యారని అని అన్నారు. అలాగే నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ ఒక పార్టీకి అత్యధికంగా యువత ఉన్న అనుబంధ సంఘం యువజన కాంగ్రెస్ అని, పేపర్ లీక్ చేస్తూ దేశ యువత జీవితాలను నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు వచ్చాయని, అలాగే ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్న బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, అలాగే యువత సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కేవలం యువజన కాంగ్రెస్ మాత్రమే అని తెలిపారు. అలాగే కొడకండ్ల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యాకేష్ మాట్లాడుతూ యువత కాంగ్రెస్ కి వెన్నుముక లాంటిదని, రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా పోరాటాలు చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యాకేష్ యాదవ్, పెద్దవంగర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హరికృష్ణ గౌడ్, డైరెక్టర్ నాగరాజు, సీనియర్ నాయకులు భిక్షపతి, అందే యాకయ్య, పసునూరి మధు, వెన్నం శ్రీనివాస్, మనోహర్, భూక్య శ్రీను, గఫూర్, అందే మల్లేష్, సుధీర్ నాయక్, వీర్య నాయక్, శ్రీకాంత్, సుమన్, దామోదర్, ప్రేమ్ కుమార్, సురేష్, రాజేష్, అజయ్, సోషియల్ మీడియా కో కోఆర్డినేటర్ ఉమేష్ మరియు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు


