
పాలకుర్తి నియోజకవర్గం తేదీ: 06-08-2026..
బోనాల పండుగ సందర్భంగా తొర్రూరు పట్టణంలో బోనమెత్తిన స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ..
బోనాల పండుగ సందర్భంగా తొర్రూరు పట్టణంలో వైభవంగా నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల మహోత్సవాల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రజాసేవతో ముందుకు సాగాలని, పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ, బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రజల విశ్వాసాలను, ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించే మహత్తర పండుగ అని అన్నారు. ప్రజల ఆశీస్సులు, అమ్మవారి కృపతో పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతరం కృషి చేస్తున్నామని, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతులు, మహిళా సంక్షేమం, యువత ఉపాధి వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తూ, నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, పట్టణ అధ్యక్షులు ముద్దసాని సురేష్, మండల అధ్యక్షులు రవీంద్ర చారి, సీనియర్ నాయకులు డా, సోమేశ్వర రావు, గంజి విజయ్ పాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు చిత్తలూరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మేకల కుమార్, యువజన నాయకులు రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్, పట్టణ పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ వార్డు కౌన్సిలర్లు, మాజీ వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, మహిళలు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు


