
నల్లబెల్లి
పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు .
నల్లబెల్లి మండల కేంద్రంలో మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమ , సంతాప సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రజా సేవలో అందించిన సేవలను, తెలంగాణ ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి చేసిన కృషిని స్మరించుకున్నారు.

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.

ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


