
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
యువ తెలంగాణ న్యూస్ 25
పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన పుల్లూరి దిలీప్ గౌడ్,మరియు కొల్లూరి మల్లయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని నేడు వారి నివాసాలకు వెళ్లి, మృతుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శలో మాజీ మంత్రి గారితో సొసైటీ మాజీ చైర్మన్ ఎం.మనోజ్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు మాజీ మండల పార్టీ అధ్యక్షులు రంగు కుమార్ గౌడ్,మాజీ ఎంపీటీసీ రాయపురం రమేష్,గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు వెంకటేశ్వర్లు మండల నాయకులు బొట్ల మధు,రంగు కుమార్ ( ఫెర్టిలైజర్ )వార్డు సభ్యులు కొప్పు రాజు, తుంగ రాజు,ఇస్లావత్ హరీష్ దొమ్మటి రాజు,నాయకులు జంగా వీరమల్లు, నీరటి సదానందం,రాజుపేట రాజు,అంబటి కుమార్,చిరుకొండ రమేష్,దుండి హరీష్ సోషల్ మీడియా ప్రతినిధి చిన్నపెల్లి అజయ్ తదితరులు ఉన్నారు.

