
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజనీ రాజశేఖర్ గారు వార్డులో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా కాలువలు, డ్రైనేజీలు, రహదారులు, నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించి, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.
ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను కాలువల్లో వేయకుండా మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
“ప్రజల సంక్షేమమే మా లక్ష్యం. వర్షాకాలంలో ప్రతి వార్డులో అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాము” అని మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజనీరాజశేఖర్ గారు తెలిపారు.
