
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు (కేటీఆర్) గారి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కొండూరు గ్రామ మాజీ సర్పంచ్ కర్ర సరిత రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వికలాంగులకు పండ్లు మరియు కొంత ఆర్థిక సహాయం చేసి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో కొండూరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
