
తొర్రూరు మండలం మడిపెళ్లి గ్రామానికి చెందిన దీకొండ ఉపేంద్ర గారు హైదరాబాదులోని పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీ కాగా జక్కన్న మహబూబ్ రెడ్డి కృషితో స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని ప్రభుత్వం ద్వారా సహకారం అందించడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ నుండి మరో లక్ష రూపాయలు సహకారం అందింది .గుండె ఆపరేషన్ పూర్తి విజయవంతంగా జరిగి పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపేంద్ర గారి కుమారుడు దీకొండ సంపత్ గారు మాట్లాడుతూ వారి తల్లి సర్జరీ సహకరించిన మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కన్న గారికి అలాగే మాలాంటి నిరుపేదలకు సహాయం అందించిన ఎమ్మెల్యే యశ్శేశ్వర్ రెడ్డి కి మా జీవితాంతం మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటామని మాలాంటి పేదవాళ్లకు ఇలా సాయం చేస్తున్న ఎమ్మెల్యే గారికి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు జాన్సమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞ్యాభి వందనాలు తెలియజేస్తున్నాను అన్నారు. అనంతరం అదే నిమ్స్ ఆస్పత్రిలో మోకాలు సర్జరీ కొరకు వచ్చిన రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన మైలారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉల్లెంగల నరసయ్య గారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారు సర్జరీ విజయవంతంగా పూర్తి చేసుకుని పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వీరి వెంట పులి వెంకన్న,యర్రం రాజు యాదవ్, గిద్ద రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


