
- పెద్ది లేడని బాధపడకండి.. పెద్దన్నగా నేనున్నా..!”
- నాన్న లేడనే బాధ మీకు ఉండొచ్చు.. కానీ మీకు పెద్దన్నగా నేను ఉన్నాను..”
- చిన్నారులను గుండెకు హత్తుకొని బాగోద్వేగానికి గురైన మాజీ ముఖ్యమంత్రి
- “కేసీఆర్ “
- పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరు పిల్లలకు చెరొక కోటి చొప్పున రూ.2 కోట్లు,తల్లి గారికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించారు,
- పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని కేసీఆర్ భరోసా
- పెద్ది యాది తలుచుకుంటే.. గుండె బరువెక్కుతుంది.. కళ్లలో నీళ్లు ఆగవు..”అన్నారు
- అమ్మా.. ధైర్యంగా ఉండాలి.. పెద్ది లేడనే లోటును ఎవరూ తీర్చలేరు.. కానీ మీకు మేమంతా అండగా ఉంటాం..”పెద్ది తల్లి కి, భార్య స్వప్న కు బరోసా, కల్పించారు
- మీ నాన్న ఆశయాలను నిలబెట్టాలి.. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి..”పెద్ది పిల్లలను అక్కున చేర్చుకుని.. వారి భవిష్యత్తుకు ఆశీర్వాదం అందించారు
- నాయకుడిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చాను.. పెద్దన్నగా నిలబడతాను..”
- కష్ట సమయంలో పెద్ది కుటుంబాన్ని పరామర్శించి.. మాటల్లోనే కాదు, చేతల్లోనూ అండగా నిలిచారు కేసీఆర్ *



