
రియానిషి తొలి జన్మదిన వేడుకల్లో సందడి
SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ప్యాక్ అందజేత.. చిన్నారికి ఆశీస్సులు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
రాయపర్తి, ఆగస్టు 1: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు చెంగల ఇందిరా గారి కుమారుడు చెంగేలా రాజేష్ కుమార్తె రియానిషి తొలి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వేడుకలకు హాజరైన SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి చిన్నారి రియానిషికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్‌ను అందజేశారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఆశ్రఫ్ పాషా, సంకినేని ఎల్లస్వామి, స్థానిక సర్పంచ్ లకావత్ రెడ్డి నాయక్, సర్పంచ్ ఇస్లావత్ సంతోష్, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మందపురి సతీష్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇలాంటి కుటుంబ వేడుకలు పరస్పర ఆత్మీయతను, సామాజిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

