
ATA 19వ మహాసభలకు అతిథిగా హాజరు.. ప్రవాస తెలుగువారితో సమావేశాలు..
తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రవాస తెలుగు సమాజంతో మమేకమయ్యేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లిన నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC-USA), టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్, అమెరికాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ అభిమానులు ఆత్మీయంగా ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలుగువారి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా పలు సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ సదస్సులో నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడుతూ వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడా భారతదేశం మీద ప్రేమతో ,కాంగ్రెస్ పార్టీ అభిమానంతో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎంతోగానో కృషి చేశారని అన్నారు.
స్వాగతం పలికిన వారిలో IOC-USA ట్రెజరర్ డా. జోషువా జయసింగ్, వర్జీనియా చాప్టర్ అధ్యక్షుడు రాయదాస్ (రాయ్) మంతెన, తెలంగాణ ప్రభుత్వ విజయా డెయిరీ చైర్మన్ అమిత్ రెడ్డి, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ నరేందర్ యలమరెడ్డి, IOC మిషిగన్ అధ్యక్షుడు శ్రీధర్ పటేల్, IOC నార్త్ కరోలినా అధ్యక్షుడు విద్యాసాగర్ వంగాల, IOC చికాగో అధ్యక్షురాలు బిందు , టీపీసీసీ ఉపాధ్యక్షుడు బి. కైలాష్ కుమార్, ICRM అధ్యక్షురాలు సుచరిత ఉన్నారు.
అదేవిధంగా గ్లోబల్ ఎన్ఆర్ఐస్ ఫోరం (USA) అధ్యక్షుడు రాజశేఖర్ కడారి, సాయిరెడ్డి గొంగటి, రాజేందర్ గాజుల, వినయ్ అరెపల్లి, వర్జీనియా రాష్ట్ర కాంగ్రెస్ మద్దతుదారులు శ్రీనివాస్ నడిపల్లి, రవీందర్ నడిపల్లి, రవీందర్ రఘునాయకల, శేఖర్ జువ్వాడి, శ్రీరామ్ ఇత్తరాజు తదితరులు స్వాగతం పలికారు.



